ఓ బీడువారిన భూమికి వర్షం కదా నువ్వు,
ఈ మోడుబారిన గుండెకి హర్షం కదా నువ్వు,
ఏ తలపే లేని మనసుకి తర్కం కదా నువ్వు,
ఎన్నెన్ని అనుకున్నా నా వ్యసనం కదా నువ్వు
-- పూర్ణ ( feb 14, 2025 )
ఓ బీడువారిన భూమికి వర్షం కదా నువ్వు,
ఈ మోడుబారిన గుండెకి హర్షం కదా నువ్వు,
ఏ తలపే లేని మనసుకి తర్కం కదా నువ్వు,
ఎన్నెన్ని అనుకున్నా నా వ్యసనం కదా నువ్వు
-- పూర్ణ ( feb 14, 2025 )
యదార్థం గా అనిపించక పోవచ్చు కానీ,
ఏ పదాలకు అందనివి ఉంటాయా కొన్ని ?
విడ్డూరం గా వినిపించచ్చేమో గానీ,
నీ పెదాలెలా కురిపిస్తున్నాయో వాటిని.
నీ వలపే వ్యాకరణం అవగా,
నా తలపు తన్మయత్వం కాదా..
ఏందో,
పరధ్యానం పడకేసి కూర్చుంది
మన ధ్యాస పరవశమైపోతోంది
--పూర్ణ (apr 16, 2023)
తలచుకుంటే ఆలోచన వే,
ఆలోచన విడవని తలపయ్యావు.
పిలుచు కుంటే ఒక పేరు వే,
తలచి తలచి ప్రేమైయ్యావు.
జరగని ఒక నిజానివే,
నిజాన్ని మించిన కల వయ్యావు.
కనులు మూస్తే దగ్గరే,
కళ్ళ కందని ఒక దూరమయ్యావు ..
-- పూర్ణ ( apr 8, 2023)
ఈ రాత్రి అనేది చాలా చెడ్డదబ్బా నిజంగా,
చాలా చాలా చెప్తుంటది , గుర్తు చేస్తుంటది
నిద్ర ఖరాబ్ చేస్తది నిజంగా.
నీ నవ్వు నాకు తెలియదా చెప్పు ,
ఇదెందుకు గుర్తు చేస్తది.
నీ లవ్వు నాకు తెలియదా చెప్పు,
ఇదెందుకు గుర్తు చేస్తది.
నీ మాట,
నీ ఆట,
నీ పాట,
నీ సిగ్గు
నాకు తెలియనివా చెప్పు ,
ఇదెందుకు గుర్తు చేస్తది.
ఈ కాలం,
ఈ రాత,
ఈ గీత,
ఈ విధీ...
నేనేమి కొల్పోయానో నాకు తెలీదా చెప్పు,
ఇదెందుకు గుర్తు చేస్తది.
పూర్ణ ( apr 2, 2023)
నన్నొదిలితే ప్రపంచాన్ని గెలుస్తానేమో కానీ,
నేనొదులుకున్న ప్రపంచం అబ్బా నువ్వు.
నేను వెతక లేని నిశీధం అబ్బా నువ్వు,
నేను వొదల్లేని విషాదం అబ్బా నువ్వు.
నేను కదల్లేని ప్రయాణమబ్బా నువ్వు,
నన్ను మెదల కుండా చేసిన మోహమబ్బా నువ్వు..
నేను తెలియ కుండా చేసిన చప్పుడబ్బా నువ్వు,
నేను తెలుసుకునే లోపే మాయమైన నా తప్పు వబ్బా నువ్వు..
నేను అనుకోని అలికిడి అబ్బా నువ్వు,
నేను కనుగోని ఒరవడి అబ్బా నీది, ఏం చెయ్యను చెప్పు
నేను వదల లేని ప్రత్యర్ధి వబ్బా నువ్వు,
నేను గెలవ లేని యుద్ధం అబ్బా నువ్వు
పడినా లేచినా ,
గురుతొచ్చినా, గాయ పడినా
కరువైనా, దూర మయినా
ఏదైనా ఏమైనా
కరిగి పోలేని
తరిగి పోలేని
నా ప్రేమ వబ్బా నువ్వు
-- పూర్ణ ( mar 26, 2023)
నా ఊహ, నా నిజం
నా ఆశ నా శ్వాస ,
నువ్వే బంగారం.
నువ్వు లేని కలతో ఒక జీవితాన్నే గడిపా
నువ్వు లేని ఒక వాస్తవాన్ని ఇప్పుడు ఊహించ లేకున్నా
మళ్లీ చెబుతున్న
నువ్వు నాకు జ్ఞాపకం కాదు
నాకు జరిగిన ఒక అద్బుతం
పూర్ణ ( mar 17, 2023)
నాలో నేను కాని ఒకడుంటాడు,
అప్పుడప్పుడూ కనబడేవాడు ఈ మధ్య ఎక్కువగా కనబడుతున్నాడు.
ఒక్కోసారి నేను వింటే సరి పోయేవి వాడు వింటాడు,
విని ఊరుకోడు.
వాడికి నాకున్నంత ధైర్యం లేదు, పిరికి వాడు
వాడికి నాకున్నంత స్థైర్యం లేదు, బలహీనుడు
నాకు పది మంది లో ఉండడం ఇష్టం , వాడు ఒంటరి
నాకు నిబ్బరం ఎక్కువ , వాడు తుంటరి
ఏన్దో వాడు అర్థం కాడు అప్పుడప్పుడూ ..
నేను నిప్పుకి ఎదురెళ్తా గానీ , వాడు ఊదితే ఆరిపోతాడు... కానీ నాలోనే ఉన్నాడు
నేను తప్పునే తమాయించుకుంటా గానీ, వాడు తలపు కే అటు ఇటు అవుతాడు .. కదిలి పోతాడు
వాడి ఆలోచన నాకు వినబడుతుంది
వాడి ఆవేదన నాకు కనబడుతుంది
తన్నినా గాయపడడు, తాకితే ఏడుస్తాడు
గుద్దినా గుర్రు మనడు, గుబులు కే గురుతు వాడు
పేరుకే పెత్తం దారు, ఒద్దన్నా ప్రేమిస్తాడు
ఏడుపంటే వాడి దగ్గరే చూసా
ఏం చేద్దాం చెప్పు,
వాడ్ని నీకు చూపించ లేదు
వాడ్ని నేనూ సరిగ్గా చూసుకోలేదు, చెప్పాలంటే
ఏం చేద్దాం చెప్పు
పూర్ణ (mar 12, 2023)