Monday, April 23, 2012

గుండె కోత


ఇది వేసవి,
పైగా పున్నమి ..
గది లోపల గాలి లేక ఉక్కపోత
మది లో, నీ తోడు లేని ఊచకోత.
డాబా పై పడుకొన్నా..
రాత్రంతా నీ వన్నెల తలపులు
గుండెంతా ఆ వెన్నెల మరకలు.
-పూర్ణ