Sunday, April 16, 2023

పరవశం

యదార్థం గా అనిపించక పోవచ్చు కానీ,

ఏ పదాలకు అందనివి ఉంటాయా కొన్ని ?

విడ్డూరం గా వినిపించచ్చేమో గానీ,

నీ పెదాలెలా కురిపిస్తున్నాయో వాటిని.


నీ వలపే వ్యాకరణం అవగా,

నా తలపు తన్మయత్వం కాదా..


ఏందో,

పరధ్యానం పడకేసి కూర్చుంది

మన ధ్యాస పరవశమైపోతోంది


--పూర్ణ (apr 16, 2023)

Saturday, April 8, 2023

నా ప్రాణమయ్యావు

తలచుకుంటే ఆలోచన వే,

ఆలోచన విడవని తలపయ్యావు.

పిలుచు కుంటే ఒక పేరు వే,

తలచి తలచి ప్రేమైయ్యావు.


జరగని ఒక నిజానివే,

నిజాన్ని మించిన కల వయ్యావు.

కనులు మూస్తే దగ్గరే,

కళ్ళ కందని ఒక దూరమయ్యావు ..


-- పూర్ణ ( apr 8, 2023)

Sunday, April 2, 2023

రాత్రి

ఈ రాత్రి అనేది చాలా చెడ్డదబ్బా నిజంగా,

చాలా చాలా చెప్తుంటది , గుర్తు చేస్తుంటది

నిద్ర ఖరాబ్ చేస్తది నిజంగా.


నీ నవ్వు నాకు తెలియదా చెప్పు ,

ఇదెందుకు గుర్తు చేస్తది.

నీ లవ్వు నాకు తెలియదా చెప్పు,

ఇదెందుకు గుర్తు చేస్తది.


నీ మాట,

నీ ఆట,

నీ పాట,

నీ సిగ్గు

నాకు తెలియనివా చెప్పు ,

ఇదెందుకు గుర్తు చేస్తది.

ఈ కాలం,

ఈ రాత,

ఈ గీత, 

ఈ విధీ... 

నేనేమి కొల్పోయానో నాకు తెలీదా చెప్పు,

ఇదెందుకు గుర్తు చేస్తది.


పూర్ణ ( apr 2, 2023)